• Neti Charithra

Breaking.. కర్ణాటక మద్యం తరలిస్తున్న రూ.70 లక్షల వాహనాన్ని సీజ్ చేసిన మదనపల్లె పోలీసులు..!


Breaking.. కర్ణాటక మద్యం తరలిస్తున్న రూ.70 లక్షల వాహనాన్ని సీజ్ చేసిన మదనపల్లె పోలీసులు..!


మదనపల్లె: నేటి చరిత్రచిత్తూరు జిల్లా మదనపల్లె స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు కర్ణాటక మద్యం తరలిస్తున్న రూ.70 లక్షల విలువైన లారీతో పాటురూ.2 లక్షల ఖరీదైన కర్ణాటక మద్యాన్నిసీజ్ చేశారు. సీఐ లు ప్రసాద్,మల్లిక ల కథనం మేరకు.. కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి బెంగుళూరు కు

సిమెంట్ తరలించే లారీ లో అక్రమం గా మదనపల్లె మీదుగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా సమాచారం అందుకున్న స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేసి వాహనాన్ని తనిఖీ చేయగా రూ.2 లక్షలు విలువైన కర్ణాటక మద్యం తో పాటు రూ.70 లక్షలు ఖరీదైన వాహనాన్ని సీజ్ చేసి నిందితుడు

రామకృష్ణ ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.