• Neti Charithra

Breaking.. కన్న కూతురిపై కన్నేసిన.. తండ్రికి 20 సం,,, జైలు శిక్ష చెప్పిన న్యాయస్థానం..!



Breaking.. కన్న కూతురిపై కన్నేసిన.. తండ్రికి 20 సం,,, జైలు శిక్ష చెప్పిన న్యాయస్థానం..!



హైదరాబాదు: నేటి చరిత్ర


అతను కన్న తండ్రి.. కన్న బిడ్డను..

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మరిచి .. మృగంలా ప్రవర్తించాడు.. కూతురిపైనే అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించిన ఘటన తెలంగాణ లో చోటు చేసుకుంది.

ఓ తండ్రికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు...

రంగారెడ్డిజిల్లా షాబాద్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి(50) కుమార్తె(13) 8వ తరగతి చదువుతోంది. 2019 అక్టోబరులో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన భార్యను కొట్టి విషయం బయటకు చెబితే ఇద్దరినీ చంపేస్తానని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న షాబాద్‌ పోలీసులు కేసు



నమోదు చేశారు. కోర్టులో పోక్సో చట్టం కింద అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డిజిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రఘునాధ్‌రెడ్డి బుధవారం తుది తీర్పు వెలువరించారు