• Neti Charithra

Breaking.. ఒకే పొట్టతో ఇద్దరు కవలలు తోజన్మనిచ్చిన మహిళ..!


Breaking.. ఒకే పొట్టతో ఇద్దరు కవలలు తోజన్మనిచ్చిన మహిళ..!నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా లో ఓ మహిళ అరుదైన కవల ల పిల్లలకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది.రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో ఆదివారం పొట్ట అతుక్కుని ఇద్దరు కవలలు జన్మించారు. ముస్తాబాద్‌కు చెందిన చెవుల లాస్య మూడో కాన్పు కోసం

ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారు. నెలలు నిండకపోవడంతో పాటు ఉమ్మనీరు లేకపోవడంతో గైనకాలజిస్టు అనూష, వైద్యులు చంద్రశేఖర్‌రావులు అత్యవసరంగా శస్త్రచికిత్స చేశారు. పొట్ట

అతుక్కుని కవలలు జన్మించారని, వారిద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. లక్షల్లో ఒకరు ఇలా జన్మిస్తారని డాక్టర్‌ చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.