• Neti Charithra

Breaking.. ఐపీఎల్ బెట్టింగులు పై పోలీసుల దాడులు..చిత్తూరు జిల్లా లో 15 మంది యువకులు అరెస్ట్..!


Breaking.. ఐపీఎల్ బెట్టింగులు పై పోలీసుల దాడులు..చిత్తూరు జిల్లా లో 15 మంది యువకులు అరెస్ట్..!



చిత్తూరు: నేటి చరిత్ర


( బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు)

చిత్తూరుజిల్లా లో బెట్టింగ్ రాయుళ్ళ పై పోలీసులు కన్నెర్ర జేశారు. ఈ దాడుల్లో

ఐపీఎల్-2020 క్రికెట్ కు బెట్టింగ్ ఆడుతున్న 15 మందిని చిత్తూరు పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి

నుంచి రూ. 2,65,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా యస్.పి సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరు ఇన్ ఛార్జ్ డి.యస్.పి తిప్పేస్వామి, చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ డి.యస్.పి సుధాకర్ రెడ్డిల పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ కే.బాలయ్య క్రికెట్ బెట్టింగ్ పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నగరంలోని

మురకంబట్టు బైపాస్ రోడ్ వద్ద, కోడిగుంట కి ఎదురుగా వున్న ఖాళి స్థలం లో కొంత మంది గుంపులుగా ఏర్పడి, మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ కి పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పలువురు ఎస్ఐ లతో కలసి దాడులు నిర్వహించారు. వారిలో 15 మంది ని అదుపులోకి తీసుకొని విచారించగా మునేంద్ర, ధనశేఖర్, దాము, వినోద్, నరసింహ, షకీల్ ఖాన్, అశోక్, సుజిత్, సాయి కుమార్, విగ్నేష్, చంద్ర బాబు, యశ్వంత్, జగదీష్, విశ్వనాద్, యోగానంద్ లను అదుపు లోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బెట్టింగ్ కి ఉపయోగిస్తున్న రూ. 2,65,500 స్వాధీనం చేసుకొని, వారి పైన గేమింగ్ యాక్ట్ మేరకు చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భం గా పోలీస్ అధికారులు మాట్లాడుతూ యువత క్రికెట్ బెట్టింగ్ కి బానిసై డబ్బులు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య వరకు వెళ్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి కూడా ఇలాంటి బెట్టింగ్ లలో పాల్పడి పోలీస్ రికార్డు లలో నమోదు కావడం వారి భవిష్యత్తు ప్రశ్నార్థక మవ్వడం తో పాటు, పదే పదే ఇలాంటి నేరాలలో పాల్పడితే వారి పైన చార్జి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి సామాజిక రుగ్మతలకు యువత దూరం గా వుండాలని, తల్లి తండ్రులు పిల్లల ప్రవర్తన, వారి అలవాట్ల పట్ల జాగ్రత్త గా ఉండాలని కోరారు. ఈ దాడుల్లో ఇంకా చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ యస్.ఐ ఈశ్వరయ్య, తాలుకా యస్.ఐ లు యన్.విక్రమ్, నాగ సౌజన్య, పాలసముద్రం యస్.ఐ షెక్సావలి, యన్.ఆర్.పేట యస్.ఐ. అనిల్ కుమార్ లు తమ సిబ్బంది రాజ్ కుమార్ , సుధాకర్ లు పాల్గొన్నారు.


439 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon