• Neti Charithra

Breaking.. ఐపీఎల్ బెట్టింగులకు అప్పులు చేసి..ఇద్దరు యువకులు ఆత్మహత్య..!


Breaking.. ఐపీఎల్ బెట్టింగులకు అప్పులు చేసి..ఇద్దరు యువకులు ఆత్మహత్య..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)

గుంటూరు జిల్లా లో క్రికెట్‌ బెట్టింగ్‌ ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. బెల్లంకొండలో జరిగిన

ఈ ఘటన విషాదాన్ని నింపింది. బెట్టింగ్‌ నిర్వహించి అప్పులపాలవ్వడంతో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్‌, కొమరయ్య పురుగుల మందు సేవించారు. చికిత్స పొందుతూ 10న సురేష్‌ మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమరయ్య శనివారం మృతిచెందాడు. ఇద్దరి మరణంతో బెల్లంకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్‌,

బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ.30 వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.