• Neti Charithra

Breaking..ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ..వాణిజ్య పన్నుల అధికారితో పాటు ముగురు అరెస్ట్..!


Breaking..ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ..వాణిజ్య పన్నుల అధికారితో పాటు ముగురు అరెస్ట్..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో

ఒంగోలు ఏసీటీవో స్వర్ణ శ్రీనివాసరావు,

తోపాటు జూనియర్‌ సహాయకుడు పసుపులేటి వెంకట నాగేశ్వరరావు, అటెండర్‌ షేక్‌ మహ్మద్‌ రఫీ లులాంఛన్ తీసుకుంటూ పట్టుపడ్డారు. ఏసీబి డీఎస్పీ ఎం.సూర్యనారాయణరెడ్డి కథనం మేరకు... కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన వ్యాపారికుప్పల యోహోను గ్రానైట్‌

పాలిషింగ్‌ వ్యాపారం చేస్తుంటారు. ఆయన లావాదేవీల్లో తనిఖీలు జరగకుండా ఉండాలంటే రూ.1.30 లక్షలు ఇవ్వాలని

వాణిజ్య పన్నుల శాఖ కు చెందిన

ముగ్గురు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. దాంతో యోహోను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.అధికారుల సూచన మేరకు..

లంచం సొత్తుతో యోహోను శుక్రవారం సీటీవో కార్యాలయానికి వెళ్లారు. ఏసీటీవో శ్రీనివాసరావుకు నగదుతో వచ్చినట్లు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జూనియర్‌ సహాయకుడు, అటెండర్‌ ఆ మొత్తాన్ని తీసుకుని కంప్యూటర్‌ గదిలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న డీఎస్పీ, సీఐ రాఘవరావు తమ సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం అక్కడ సోదాలు నిర్వహించి మరో రూ.82,680 స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారిని ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచగా వారిని రిమాండ్ కు పంపారు.