• Neti Charithra

Breaking.. ఏసీబీ కి చిక్కిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారి.. పట్టుపడ్డకోట్లాది.. ఆస్తులు..!


Breaking.. ఏసీబీ కి చిక్కిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారి.. పట్టుపడ్డకోట్లాది.. ఆస్తులు..!నెల్లూరు: నేటి చరిత్ర


నెల్లూరు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి భారీగా అక్రమాస్తుల గుర్తించారు. ఇందుకు సంబంధించి న వివరాలు ను ఏసీబీ అధికారులు వివరించారు.

అక్రమాస్తుల గురించి వివిధ వర్గాలు అందించిన సమాచారం మొత్తం ఐదు* ప్రాంతాల్లో దాడులు నిర్వహించి సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకు గుర్తించామనిఏసీబీ ఏఎస్పీ దేవానంద్ శాంత్రో పేర్కొన్నారు .

బుధవారం సాయంత్రం ఆయన

మీడియాతో మాట్లాడుతూ.. తమకున్న సమాచారం తో ఏడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని ఈ దాడుల్లో రెండు ఇళ్లు , 14 ఎకరాల వ్యవసాయ భూమి , ఐదు ఇళ్ల స్థలాలు, 50 లక్షల


డిపాజిట్లుగుర్తించామన్నారు... ఐసిఐసిఐ బ్యాంకు కు సంబంధించి లాకర్ ను తెరవాల్సి ఉందని పేర్కొన్నారు... 1995 లో సాధారణ స్థాయిలో ఉద్యోగంలో చేరిన విజయ్ కుమార్ రెడ్డిఅంచెలంచెలుగా ఎదిగి 2017 లో సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికిచేరుకున్నాడన్నారు... విజయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన పేర్కొన్నారు.