• Neti Charithra

Breaking.. ఏసీబీ అధికారుల దాడులు.. భారీగా పట్టుపడ్డ విద్యుత్ ఉద్యోగి అక్రమస్తులు..!


Breaking.. ఏసీబీ అధికారుల దాడులు.. భారీగా పట్టుపడ్డ విద్యుత్ ఉద్యోగి అక్రమస్తులు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఏసీబీ అధికారుల దాడుల్లో ఓ విద్యుత్ ఉద్యోగి అక్రమ సంపాదన విశాఖ జిల్లాలోభారీగా బయట పడింది. కొమ్మాది డివిజన్‌ విద్యుత్‌ ఏఈ నాగేశ్వరరావు ఇంట్లో అనిశా అధికారులు గురువారం సోదాలు చేపడుతున్నారు. ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో ఉదయం నుంచి నగరంలోని 7 చోట్ల సోదాలు కొనసాగు తున్నాయి. నాగేశ్వరరావు, అతని బంధువుల పేరిట హైదరాబాద్‌తో పాటు ఏపీలోని పలుచోట్ల ఇళ్లస్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.1991లో నాగేశ్వరరావు సర్వీసులో చేరారు. 1994లోనే తొలిసారిగా ఏసీబీ కి అప్పట్లో చిక్కడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినప్పటికీ ఆయన తీరుమారకపోవడంతో ఉన్నతాధికా రులుపూర్తిగా విధుల నుంచి పక్కన పెట్టారు. దాదాపు 15 ఏళ్లపాటు ఆయన్ను విధులకు దూరంగా ఉంచారు.2012లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారని, ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు తాజాగా ఏఈ ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు.కోట్ల లో అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది


348 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon