- Neti Charithra
Breaking.. ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ దేవాదాయ శాఖ ఉద్యోగి..!
Breaking.. ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ దేవాదాయ శాఖ ఉద్యోగి..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
కర్నూలు జిల్లా నందిగామ శుకశ్యామలాంబ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయ సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి రూ.25 వేలు లంచం తీసుకుంటూఅవినీతి నిరోధక
శాఖ అధికారులకు చిక్కారు. ఏసీబీ
డీఎస్పీ శరత్‌బాబు కథనం మేరకు..
శివాలయంలో బండ్ల సుధీర్ 2009 నుంచి అటెండర్‌గా పని చేస్తున్నారు. 2014లో ఉద్యోగం రెగ్యులర్ చేశారు. అతని తండ్రి అనారోగ్యం బారిన పడటంతో 2016లో దీర్ఘకాలిక సెలవు పెట్టారు. అనంతరం
విధుల్లో చేరడానికి ముగ్గురు ఈవోల చుట్టు తిరిగినా ఫలితం లేకపోయింది. హైకోర్టును ఆశ్రయించగా, మూడు మాసాల్లో విధుల్లో చేర్చుకోవాలని జులై 28న ఆదేశాలిచ్చింది. అయినా ఈవో చేర్చుకోలేదు. రూ.3 లక్షలు ఇస్తే విధుల్లోకి తీసుకుంటామని సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి చెప్పడంతో తొలుత రూ.25 వేలు ఇవ్వడానికి ఒప్పందం
చేసుకున్నారు. అనంతరం ఏసీబీ
అదనపు ఎస్పీ మహేశ్వరరాజును అటెండర్ ఆశ్రయించారు. వారి పథకం ప్రకారం.. అటెండరు నుంచి శోభనాద్రి రూ.25 వేలు తీసుకుంటుండగా డీఎస్పీ శరత్‌బాబు, సీఐలు దాడి చేసి పట్టుకున్నారు.