• Neti Charithra

Breaking.. ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులపై.. ఏసీబీ అధికారుల దాడులు.. పోలీస్ శాఖలో కల కలం..!


Breaking.. ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులపై.. ఏసీబీ అధికారుల దాడులు.. పోలీస్ శాఖలో కల కలం..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా లో మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూడటం తెలుగు రాష్ట్రాల్లో కల కలం రేపింది.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో

బుధవారం ఉదయం నుంచే సోదాలు చేస్తోంది. నర్సింహారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌లో 20 చోట్ల, వరంగల్‌ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని

అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్‌ సీఐగా పని చేశారు. ఆ సమయంలో పలు ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, భూ వివాదాల్లో తలదూర్చినట్లు నర్సింహారెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్