• Neti Charithra

Breaking..ఏపీ లో 13 జిల్లాల్లో బిజెపి నేతల నిరసన.. పలు చోట్ల ఉద్రిక్తత..!


Breaking..ఏపీ లో 13 జిల్లాల్లో బిజెపి నేతల నిరసన.. పలు చోట్ల ఉద్రిక్తత..!



నేటి చరిత్ర:( న్యూస్ నెట్ వర్క్)



ఏపీ లోని 13 జిల్లా కేంద్రాల్లో భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని, భేషరతుగా క్షమాపణలు

చెప్పాలని డిమాండ్‌ చేశారు. పలు చోట్ల భాజపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో భాజపానేత విష్ణువర్థన్‌రెడ్డి, తిరుపతిలో భానుప్రకాశ్‌రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు

పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమాన పర్చారని మండిపడ్డారు. గుడివాడలో భాజపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పలు చోట్ల

పోలీసులు బిజెపి నేతలను అడ్డుకోవడం తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్