• Neti Charithra

Breaking.. ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల పై.. సంచలన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు..!


Breaking.. ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల పై.. సంచలన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు..!



నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)


ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై

హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, అందుకు ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది.

ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం తరుఫు నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని, కరోనా పరిస్థితులపై ఎస్‌ఇసి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. అధికారుల బృందం ఎస్‌ఇసితో చర్చించిన అంశాలను తెలపాలని, దీనికి సంబంధించి ఈ నెల 29న తదుపరి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.