• Neti Charithra

Breaking.. ఏపీ లో సబ్సిడీ బియ్యం.. డోర్ డెలివరీ వాహనాలను పరిశీలించిన ఎన్నికల కమిషనర్ "నిమ్మగడ్డ.".!


Breaking.. ఏపీ లో సబ్సిడీ బియ్యం..

డోర్ డెలివరీ వాహనాలను పరిశీలించిన ఎన్నికల కమిషనర్ "నిమ్మగడ్డ.".!



విజయవాడ: నేటి చరిత్ర


ఏపీ లో కీలకంగా మారిన రేషన్‌ పంపిణీ వాహనాలను రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బుధవారం ఉదయం పరిశీలించారు. ఏపీ ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ రూపొందించిన నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన రెండు వాహనలను ఎస్‌ఈసీ పరిశీలించారు. ఈ సందర్భంగా పంపిణీ ఏ రకంగా జరుగుతుందో పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ వివరించారు. పంపిణీ వాహనంలో ఎక్కి పరిశీలించిన నిమ్మగడ్డ... వాహనాల్లో

సదుపాయాలు, వినియోగాన్ని పరిశీలించారు. వాహనం డ్రైవర్‌ కేబిన్‌లో కూర్చుని రేషన్‌ పంపిణీ వివరాలను అధికారులను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అడిగి తెలుసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు.. పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు వాహనాల వినియోగాన్ని ఎన్నికల సంఘం కు వివరించారు.