• Neti Charithra

Breaking.. ఏపీలో వాయిదా పడ్డ మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు..!


Breaking.. ఏపీలో వాయిదా పడ్డ మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


స్థానిక ఎన్నికల నిర్వహణ పై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఏపీ ఎన్నికల సంఘం మొదటి విడత పోలింగ్ ప్రక్రియ తేదీ లను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 9న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.


580 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon