• Neti Charithra

Breaking..ఏపీ లో రెండు చోట్ల తప్ప.. మొత్తం మున్సిపాలిటీల్లో కొన సాగుతున్న వైసీపీ హవా..!


Breaking..ఏపీ లో రెండు చోట్ల తప్ప.. మొత్తం మున్సిపాలిటీల్లో కొన సాగుతున్న వైసీపీ హవా..!


విజయవాడ:నేటి చరిత్ర


ఏపీ లో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ వైసిపి ప్రభంజనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కార్పొరేషన్లు సహామున్సిపాలిటీలన్నిం టిలోనూ క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 12 కార్పొరేషన్లకు 11 కార్పొరేషన్లలో కౌంటింగ్‌ జరగగా 10 కార్పొరేషన్లలో విజయం సాధించింది. 75 మున్సిపాలిటీలకు గానూ 72 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కౌంటింగ్‌ జరుగుతున్న మచిలీపట్నం కార్పొరేషన్లలోనూ వైసిపి ఆధిక్యంలో ఉంది. ఇక, రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లాల్లోని మైదుకూరు మున్సిపాలిటీల్లో టిడిపి ఆధిక్యంలో నిలిచింది. టిడిపి సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, బాలకృష్ణకు సైతం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు ప్రజలు జైకొట్టడంతో ఎపిలో ఇంత వరకు ఎన్నడూ, ఏ పార్టీ పొందని అత్యధిక సీట్లు వైసిపి కైవసం చేసుకుంది.