- Neti Charithra
Breaking.. ఏపీ లో మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..!
Breaking.. ఏపీ లో మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం..!
విజయవాడ: నేటి చరిత్ర
ఏపీ లో ఎన్నికల కమిషన్ మరో సంచలన నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఫిర్యాదులను స్వీకరించేందుకుంగానూ ఎస్ఈసి కొత్తగా తయారు చేసిన 'ఈ-వాచ్' యాప్‌ను విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బుధవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాట్లాడుతూ... ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు, ప్రలోభాలకు గురి చేసినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గురువారం నుండి ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉండనుందని వివరించారు. పండుగలకు ఎలా వస్తారో, అలాగే ఎన్నికలకు కూడా సొంత గ్రామాలకు వచ్చి ఓట్లు వేయాలని ఓటర్లకు ఆయన కోరారు.
809 views0 comments