- Neti Charithra
Breaking.. ఏపీ లో మరో మంత్రికి.. కరోనా పాజిటివ్..!
Breaking.. ఏపీ లో మరో మంత్రికి.. కరోనా పాజిటివ్..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఏపీలో మరో మంత్రి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఇటీవలే తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నంటే ఉన్నారు మంత్రి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమలలోనే ఉండి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించారు. ఈనెల 25 వ తేదీన తిరిగి విజయవాడకు చేరుకున్న మంత్రి
వెల్లంపల్లిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ నిర్ధారణ పరీక్షల్లో మంత్రికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.