• Neti Charithra

Breaking.. ఏపీ లో మరో కలెక్టర్ కు కరోనా పాజిటివ్.. అధికారుల్లో కల కలం..!


Breaking.. ఏపీ లో మరో కలెక్టర్ కు కరోనా పాజిటివ్.. అధికారుల్లో కల కలం..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)



ఏపీ లో మరో కలెక్టర్ కు కరోనా పాజిటివ్ తేలింది. ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్త కరోనా తో హోమ్ ఐసోలేషన్ లో కెళ్లి సోమవారం విధులకు హాజరు అయ్యారు. తాజాగా కడప జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌

ఆదివారం సాయంత్రం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం ఫలితాలు రాగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్‌ ఐసోలేషన్‌లో

ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పోస్టు చేశారు. గత వారం రోజుల్లో తనను కలిసిన ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.