• Neti Charithra

Breaking..ఏపీ లో ప్రభుత్వ పాఠశాలలు పూర్తి స్థాయి లో ప్రారంభానికి విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!


Breaking..ఏపీ లో ప్రభుత్వ పాఠశాలలు పూర్తి స్థాయి లో ప్రారంభానికి విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

పేర్కొన్నారు.విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మించి అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు. గదులు సరిపోనిచోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.