• Neti Charithra

Breaking.. ఏపీ లో కార్పొరేషన్.. ల చెర్మన్..డైరెక్టర్ లకు..జీతాలు ప్రకటించిన ప్రభుత్వం..!


Breaking.. ఏపీ లో కార్పొరేషన్.. ల

చెర్మన్..డైరెక్టర్ లకు..జీతాలు ప్రకటించిన ప్రభుత్వం..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో కొత్తగా ఏర్పాటు ఆయిన

బీసీ కులాల సంక్షేమ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతాలు, అలవెన్సులను జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రతి కార్పొరేషన్

ఛైర్మన్​కు రూ.56 వేలు, డైరెక్టర్​కు రూ. 12వేలు చెల్లించాలని నిర్ణయించింది. మొత్తంగా ఒక్కో బీసీ కులం కార్పొరేషన్​కు రూ. 2.12 లక్షలు కేటాయించనుంది. ఈ మొత్తంతోనే కార్యాలయం వసతి, ఇతర

ఖర్చులు భరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 1 నుంచి ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.