- Neti Charithra
Breaking.. ఏపీ లో కొత్త కరోనా కేసు నమోదు.. నిర్ధారించిన ప్రభుత్వం.. ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రజలు..!
Breaking.. ఏపీ లో కొత్త కరోనా కేసు నమోదు.. నిర్ధారించిన ప్రభుత్వం..
ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రజలు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఏపీ లో కొత్త కరోనా కేసు నమోదు కావడంతో
రాష్ట్ర ప్రజలు ఉలిక్కి పడ్డారు. తాజాగా
కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసు నమోదైంది. యూకే నుంచి రాజమండ్రికి చేరుకున్న మహిళకు స్ట్రెయిన్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మంగళవారం
అధికారికంగా వెల్లడించారు. సీసీఎంబీ, ఎన్ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్
నిర్ధారణ అయినట్లు ధ్రువీకరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. ఆమె కుమారుడి సహా కుటుంబసభ్యులకూ కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. కాగ ఆమె ఢిల్లీ నుంచి వచ్చిన రైలు లో ఆమె తో ఎవరెవరు..సన్నిహితంగా ఉన్నారనే సమాచారాన్ని పలు శాఖల అధికారులు అరా తీస్తున్నారు.