• Neti Charithra

Breaking.. ఏపీలో ఎన్నికల వేళ.. కోటికి పై గా నగదు పట్టివేత..!


Breaking.. ఏపీలో ఎన్నికల వేళ.. కోటికి పై గా నగదు పట్టివేత..!



విజయవాడ:నేటి చరిత్ర


ఏపీ లో స్థానిక ఎన్నికలు వేడెక్కుతున్న వేళ

భారీగా నగదు పట్టుపడటం రాజకీయ వర్గాల్లో కల కలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..

కృష్ణాజిల్లా గరికపాడు వద్ద ఆదివారం

భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో ఎలాంటి ఆధారాల్లేని రూ.1.10కోట్ల నగదును గుర్తించారు. తెలంగాణాలోని కోదాడ నుండి విజయవాడ వస్తుండగా కారులో ఈ నగదు బయటపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల జాతర జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నగదు ఏమిటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల కోసమా? బ్లాక్‌ మనీనా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.