• Neti Charithra

Breaking.. ఏపీ లో ఇంటర్ ఆన్ లైన్ ప్రవేశాలకు బ్రేక్.. స్టే మంజూరు చేసిన హైకోర్టు..!


Breaking.. ఏపీ లో ఇంటర్ ఆన్ లైన్ ప్రవేశాలకు బ్రేక్.. స్టే మంజూరు చేసిన హైకోర్టు..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


ఏపీలో ఇంటర్మీడియట్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్మీడియట్ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నిర్వహణ అంశంపై దాఖలైన పిటిషన్‌ని న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది

తమకు మరింత సమయం కావాలని విఙ్ఞప్తి చేశారు. దీంతో ఈ నెల 10 వరకు స్టే ఇస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని‌ హైకోర్టు ఆదేశించింది.దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో ఆన్‌లైన్‌లో అడ్మిషన్లను నిర్వహిస్తున్నారని న్యాయవాది అన్నారు. ఆన్‌లైన్‌లో అడ్మిషన్ వల్ల పిల్లలు భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన

తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ ప్రక్రియ ఉందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏ రూల్స్ ప్రకారం ముందుకు వెళ్తున్నారని న్యాయశాఖ విద్యాశాఖను ప్రశ్నించింది. పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయొద్దని జస్టిస్‌ వెంకట రమణ అన్నారు.