• Neti Charithra

Breaking..ఏపీ ప్రభుత్వానికి చెన్నై న్యాయస్థానం లో చుక్కెదురు..!


Breaking.. ఏపీ ప్రభుత్వానికి చెన్నై

న్యాయస్థానం లో చుక్కెదురు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. పోతిరెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పని సరి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.

పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో విచారణ జరిగింది. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని కూడా ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పోతిరెడ్డి పాడు

ప్రాజెక్టు నిర్మాణం కోసం పర్యావరణ అనుమతులు తప్పనిసరి అయింది.

తెలంగాణా కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు..చెన్నై లోని న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీచేసింది.