• Neti Charithra

Breaking.. ఏపీ ని మళ్ళీ.. వణికిస్తున్న ..కరోనా ఒకే రోజు వెయ్యికి చేరువలో కేసులు..!


Breaking.. ఏపీ ని మళ్ళీ..

వణికిస్తున్న ..కరోనా ఒకే రోజు వెయ్యికి చేరువలో కేసులు..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో కరోనా కేసులు మళ్ళీ వనికిస్తున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.24 గంటల వ్యవధిలో ఏకంగా 984 కేసులు నిర్ధారణ అయ్యాయి. 40, 604 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 984 కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా గుంటూరులో 176 కేసులు

( జిల్లాలు వారీగా నమోదు అయిన పాజిటివ్ కేసులు)


నమోదయ్యాయి. ఇక విశాఖపట్నంలో 170, చిత్తూరులో 163, కృష్ణాలో 110 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రాష్ట్రవైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 8,96,863 మంది వైరస్‌ బారిన పడ్డారు. చిత్తూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతుల సంఖ్య 7,203కి చేరింది. ఇక 24 గంటల్లో 306 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 4,145 ఉన్నాయి. ఇక నాలుగు జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.