• Neti Charithra

Breaking.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం లో మరోసారి కీలక ప్రకటన చేసిన కేంద్రం..!


Breaking.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం లో మరోసారి కీలక ప్రకటన చేసిన కేంద్రం..!



ఢిల్లీ: నేటి చరిత్ర


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. వైసీపీ పార్లమెంటరీ నేత ఎంపీ మిథున్ రెడ్డి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతోపాటు అనేక మినహాయింపులు ఇచ్చామంటూ వివరించారు. విభజన సమస్యల పరిష్కారంపై కూడా ఓ రకంగా కేంద్రం చేతులెత్తేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయని.. వాటి పరిష్కారం తమ చేతుల్లో లేదని నిత్యానందరాయ్ అన్నారు. ఆయా సమస్యల్ని ఏపీ- తెలంగాణ ప్రభుత్వాలే పరిష్కరించుకో వాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని MP రామ్మోహన్ నాయుడు తీవ్రంగా ఖండించారు.