• Neti Charithra

Breaking..ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ పై నిప్పులు ..చెరిగిన..సజ్జల రామకృష్ణ రెడ్డి..!


Breaking..ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ పై నిప్పులు ..చెరిగిన..సజ్జల రామకృష్ణ రెడ్డి..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరిగారు. నిమ్మగడ్డ లో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనిపిస్తోందన్నారు. రిటైర్డ్ అయిన అధికారి అయి ఉండి సీనియర్ ఐఏఎస్ ల పై

ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ నిమ్మగడ్డ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాగాన్ని అస్థిరపర్చాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూస్తున్నారన్నారు. ఎన్నికల విధులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీనియర్ అధికారుల పట్ల నిమ్మగడ్డ వాడిన భాషఅభ్యంతరకరమన్నారు. చంద్రబాబు చెప్పినట్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నడుచుకుంటున్నారని సజ్జల ఆరోపించారు.