• Neti Charithra

Breaking.. ఏడేళ్ళ బాలిక పై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..!


Breaking.. ఏడేళ్ళ బాలిక పై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..!



నెల్లూరు: నేటి చరిత్ర


నెల్లూరు జిల్లాలో ఏడేళ్ళ బాలికపై అఘాయిత్యం జరిగింది. అభంశుభం తెలియని ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. సంగం

మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పక్కనే ఉన్న ఇంటి సమీపంలో

స్నేహితులతో ఆడుకునేది. రెండు రోజుల క్రితం గ్రామంలోని తన సోదరి ఇంటికి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువకుడు బుధవారం ఎవరూ లేని సమయంలో బాలికను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో బాలిక బోరున ఏడుస్తూ ఇంటికి చేరి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పరువు

పోతుందనే భయంతో వారు మౌనం దాల్చారు. అయితే బాలిక అనారోగ్యానికి గురవడంతో గురువారం సమీప ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.