• Neti Charithra

Breaking.. ఏటీఎమ్ లో అగ్ని ప్రమాదం.. ఎస్ బి ఐ కి భారీ నష్టం..!


Breaking.. ఏటీఎమ్ లో అగ్ని ప్రమాదం..

ఎస్ బి ఐ కి భారీ నష్టం..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఎస్బి ఐ కి చెందిన ఏటీఎమ్ కేంద్రం దగ్ధం ఆయిన ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు లో జరిగింది. సోమవారం జరిగిన ప్రమాదం లో లక్షల్లో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.ఒక్కసారిగా ఏటీఎంలో మంటలు చెలరేగటంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అదుకున్న ఎస్‌బీఐ అధికారులు

హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను ఆర్పించే ప్రయత్నం చేయించారు. అదుపులోకి రాకపోవడంతో అగ్ని మాపక కేంద్రం కు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఏటీఎంలో రూ.8.3 లక్షల మేర నగదు ఉందని అధికారులు తెలిపారు. ఎన్‌సీఆర్‌(ఎటీఎం వెండర్‌) సహాయంతో ఏటీఎంను తొలగిస్తే లోపల ఉన్న నగదుపై స్పష్టత వస్తుందని మేనేజర్‌ చెప్పారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.