• Neti Charithra

Breaking.. ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.. కీలక రికార్డులు స్వాధీనం.!


Breaking.. ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.. కీలక రికార్డులు స్వాధీనం.!



కర్నూలు: నేటి చరిత్ర


అవినీతి ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఎంపీడీఓ కార్యాలయం పై దాడులు చేసిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్యాపిలి మండల

ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ

డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్‌, సీతారామిరెడ్డి తదిరులు తనిఖీలు చేపట్టారు. ప్యాపిలి మండలం మెట్టుపల్లె గ్రామానికి చెందిన సుబ్బన్న కుమారుడు చంద్రుడు ఫిర్యాదు మేరకు అధికారులు. దాడులు చేసినట్లు తెలుస్తోంది.

మెట్టుపల్లెకు చెందిన సుబ్బన్న తన పొలంలో పట్టు పరిశ్రమ షెడ్డు ఏర్పాటు చేసుకునేందుకు పట్టు పరిశ్రమ శాఖ, ఉపాధి హామీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 2019లో పట్టు పరిశ్రమ శాఖ నుంచి షెడ్డు ఏర్పాటుకు రూ.8.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.5.50 లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రావాల్సి ఉందన్నారు. వాటిలో 2020 అక్టోబరులో రూ.3.15లక్షలు మంజూరయ్యాయన్నారు. మిగతా నిధులు రావాల్సి ఉండగా.. వీటిని మంజూరు చేసేందుకు ఎంపీడీవో ఫజుల్‌రహిమాన్‌, ఏపీవో వెంకటేశ్వర్లు, ఈసీ నాగమునికుమార్‌ 9 శాతం లంచం ఇవ్వాలని అడిగినట్లు బాధితుడు స్పందనలో ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో లో దాడులు జరిపి అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్