• Neti Charithra

Breaking.. ఎస్సిల వర్గీకరణ జరిగే వరకు.. పోరాటం- తంబల్లపల్లె లో మందకృష్ణ మాదిగ


Breaking.. ఎస్సిల వర్గీకరణ జరిగే వరకు.. పోరాటం- తంబల్లపల్లె లో మందకృష్ణ మాదిగ


తంబల్లపల్లె: నేటి చరిత్ర


ఎస్సి ల వర్గీకరణ కోసం.. అంతిమ పోరు కు మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. చిత్తూరు. జిల్లా తంబల్లపల్లె లో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్యుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన

మాట్లాడుతూ మాదిగ ల వర్గీకరణ రిజర్వేషన్ కోసం ఎంతో మంది ఉద్యమ పోరులో ప్రాణాలను సైతం వదిలి అమరులు అయ్యారన్నారు. తమ పోరు అంతిమ దశకు కు చేరిందని త్వరలో మాదిగల వర్గీకరణ ఫలాలు అందనున్నాయన్నారు.16 సంవత్సరాలు పాటు నిరవధిక ఆందోళనలు జరిపిన బలమైన శక్తి ఎమ్మార్పీఎస్ కుటుంబ సభ్యులకు దక్కుతుందన్నారు. ఎస్సి వర్గీకరణ ఫలాలు దక్కే వరకు ఉక్కు సంకల్పంతో ఉద్యమం కొనసాగుతుందని ఆయన అన్నారు. గతం లో మాదిగ లు అని ఉచ్చరించటానికి అంటరానితనం అడ్డు వస్తుందని మొహమాట పడే స్థాయి నుంచి నేడు మేము మాదిగ కులస్తులం అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరటం గర్వ కారణం అని ఆయన అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం గతం లో ఎస్సిల వర్గీకరణకు మద్దతు తెలిపి అధికారం లోకి రాగానే ఆ విషయం మరిచారని విమర్శించారు.

సమావేశం లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ నాయకులువాసు, మనోహర్, రాజా, దుమ్ము చిన్నా, భవాని వెంకటేస్, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.