• Neti Charithra

Breaking...ఎర్రచందనం స్మగ్లర్ లు పై టాస్క్..ఫోర్స్ దాడులు చిత్తూరుజిల్లా లో ముగ్గురు అరెస్ట్..!


Breaking...ఎర్రచందనం స్మగ్లర్ లు పై టాస్క్..ఫోర్స్ దాడులు చిత్తూరుజిల్లా లో ముగ్గురు అరెస్ట్..!



తిరుపతి: నేటి చరిత్ర


తిరుపతి సమీపం తిరుచానూరు,చంద్రగిరి బైపాస్ రోడ్డులో డంప్ చేసి ఉంచిన ఐదు ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. డీఎస్పీ వెంకటయ్య ఆదేశాల మేరకు రైల్వే కోడూరు టాస్క్ ఫోర్స్ ఆర్ ఐ కృపానంద టీమ్ సోమవారం అర్థరాత్రి

రవాణా చేస్తున్న ఐదు దుంగలతో ఉన్న ఆటోను అడ్డగించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని చిన్న గొట్టి గల్లు కు చెందిన కంచం సాయి ప్రసాద్ (21), మేకల శివారెడ్డి (37), బత్తల దిలీప్ కుమార్ (27) గా గుర్తించారు. ఈ ముగ్గురు నిందితులు గతంలో ఇదే ప్రాంతం నుంచి డంప్ చేసి ఉంచిన ఎర్రచందనం దుంగలను రవాణా చేసిన అనుమానం తో విచారణ చేపట్టారు. వీరు తరచు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ తిరుపతి బైపాస్ రోడ్డు లోని ఎమ్మార్ పల్లి సర్కిల్ వద్ద ఉన్న ఇందిరమ్మ ఇళ్ల వద్ద నుంచి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిసిందని అన్నారు. దీంతో అప్రమత్తమై టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఆ ప్రాంతానికి పంపినట్లు తెలిపారు. వీ రు సమీపంలో

దుంగలను డంప్ చేసి రవాణా కు పాల్పడుతున్నారని చెప్పారు. మరి కొన్ని దుంగలను కూడా డంప్ చేసి ఉంటారనే అనుమానం తో వీరిని విచారిస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి సిఐ సుబ్రమణ్యం, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ చేరుకున్నారు. సిఐ సుబ్రమణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.