- Neti Charithra
Breaking.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన 57 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు..!
Breaking.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన 57 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు..!
నేటి చరిత్ర: హైదరాబాదు
టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లతో
దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన లో 57
మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు కథనం మేరకు.. వరంగల్ జిల్లా
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి, అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయిన భాజపా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్తో పాటు 44 మందికి 15 వరకు వరంగల్ ఆరో అదనపు మునిసిఫ్ మెజిస్ట్రేట్ ఎ.కుమారస్వామి రిమాండ్కు ఆదేశించారు. బెయిల్ కోరుతూ వారి న్యాయవాదులు దాఖలు చేసిన దరఖాస్తుల విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. రామమందిరం విషయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచిత వాఖ్యలు చేశారనే ఆరోపణలపై భాజపా కార్యకర్తలు పలువురు ఆదివారం హన్మకొండలోని ఆయన ఇంటిపై దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. సుబేదారి ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు రావు పద్మారెడ్డి, కొంటేటి శ్రీధర్ సహా 57 మందిపై కేసు నమోదు చేశారు
.