• Neti Charithra

Breaking.. ఎమ్మార్ కళాశాల వద్ద ఉద్రిక్తత..విద్యార్థుల పై లాఠీ ఛార్జ్..!


Breaking.. ఎమ్మార్ కళాశాల వద్ద ఉద్రిక్తత..విద్యార్థుల పై లాఠీ ఛార్జ్..!



విజయనగరం : నేటి చరిత్ర



విజయనగరం ఎమ్మార్‌ కాలేజి వద్ద

శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఎమ్మార్‌ కాలేజీని ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ.. ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన పిలుపులో

భాగంగా కాలేజి వద్ద విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను బహిష్కరించాలని కోరుతూ నినదించారు. నిరసన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను బలవంతంగా పరీక్షకు

పంపేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులెవరూ పరీక్షకు లోనికి వెళ్లకుండా నేతలు కాలేజి బయట గుమికూడారు. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు.