• Neti Charithra

Breaking.. ఊరంతా..ఒక్కటయ్యారు.. గ్రామ వాలంటీర్ ను ఏకగ్రీవ సర్పంచ్ చేశారు..!


Breaking.. ఊరంతా..ఒక్కటయ్యారు.. గ్రామ వాలంటీర్ ను ఏకగ్రీవ సర్పంచ్ చేశారు..!కదిరి: నేటి చరిత్ర


ఆమె మొన్నటి వరకు.. సాధారణ యువతి..కుటుంబానికి రాజకీయ నేపథ్యం అంతకన్నా లేదు.. కేవలం గత సంవత్సరం కాలంగా గ్రామ వాలంటీర్ గాగ్రామస్తులకు నిస్వార్థంగా సేవలు అందిస్తోంది. ఆమె సేవలు నేడు ఓ గ్రామ పంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికయ్యేందుకు దోహద పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

కదిరి మండలం ముత్యాలచెరువు

పంచాయతీ సర్పంచ్‌ స్థానం బిసి మహిళకు రిజర్వ్‌ అయింది. గ్రామానికి చెందిన యువతి శుభలేఖ తన వాలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్‌ ఎన్నికకు నామినేషన్‌ వేశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా నామినేషన్‌లు వేశారు. అయితే, శుభలేఖ ఉత్తమ సేవలు అందించి ఉండటం, గ్రామస్తుల నిర్ణయం మేరకు మిగతా ముగ్గురూ గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో శుభలేఖ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు.