• Neti Charithra

Breaking..ఉపాధ్యాయుడు ని పొడిచి చంపిన దుండగులు..!


Breaking..ఉపాధ్యాయుడు ని పొడిచి చంపిన దుండగులు..!



హైదరాబాదు: నేటి చరిత్ర


ఓ ఉపాధ్యాయుడు ను ప్రత్యర్ధులు కత్తి

తో పొడిచి చంపిన దారుణ హత్య సంచలనం కలిగించింది ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మహబూబ్‌నగర్‌లో బుధవారం రాత్రి ఉపాధ్యాయుడు నరహరి(40)ని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. మహబూబ్‌నగర్‌లోని పశువుల కిష్టారెడ్డి గార్డెన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సి.సి.కుంట మండలం ఉండ్యాలలో నరహరి ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించేవారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగ ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.