- Neti Charithra
Breaking... ఉపాధ్యాయుడి ట్యూషన్ కొంప ముంచింది..54 మంది కి కరోనా పాజిటివ్..!
Breaking... ఉపాధ్యాయుడి
ట్యూషన్ కొంప ముంచింది..54 మంది కి కరోనా పాజిటివ్..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఓ గ్రామం లో ట్యూషన్ కు వెళ్లిన విద్యార్థులకు గంప గుత్త గా కరోనాఏకంగా 54 మందికి ముట్టడించిన ఘటన గుంటూరు జిల్లా లో కల కలం రేపింది.
వివరాల్లోకి వెళితే..సత్తెనపల్లి మండలం భట్లూరులో సోమ, బుధ, గురువారాల్లో 349 మందికి పరీక్షలు చేయగా 45 మందికి వైరస్ సోకినట్లు వెళ్లడైంది. శుక్రవారం మరో 200 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..9 మందికి కొవిడ్ నిర్ధారణ
అయినట్లు ఫణిదం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శేషుయాదవ్ తెలిపారు. గ్రామానికి చెందిన ఒక గర్భిణి ప్రసవం నిమిత్తం గుంటూరు సర్వజనాసుపత్రికి వెళ్లగా అక్కడ ఆమెకు గతనెల 25న కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమె భర్త, అత్తకు పరీక్షలు నిర్వహించగా వారికి వ్యాధి ఉన్నట్లు స్పష్టమైంది. గర్భిణి భర్త స్థానికంగా 30 మంది విద్యార్థులతో ట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఆయన నుంచి పిల్లలకు వైరస్ సోకింది. 17 మంది విద్యార్థులకు ఎటువంటి లక్షణాలు లేకున్నా.. వైరస్ సోకిన మొత్తం అందరితోపాటు వారిని కూడా గుంటూరులోని క్వారంటైన్
కేంద్రాలకు తరలించారు. ఎస్సీ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థుల్లో 14 మంది ఆరోగ్యంగానే ఉన్నారని డీఎంహెచ్‌వో యాస్మిన్ తెలిపారు.