• Neti Charithra

Breaking.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తూ.. పట్టుపడ్డ ఉపాధ్యాయుడు..!


Breaking.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తూ.. పట్టుపడ్డ ఉపాధ్యాయుడు..!



మచిలీపట్నం-నేటి చరిత్ర


ఎమ్మెల్సీ ఎన్నికలలో నగదు పంపిణీ చేస్తూ

ఓ ఉపాధ్యాయుడు పట్టుపడి న ఘటన మచిలీపట్నం లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.కృష్ణా, గుంటూరు జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం నగదు పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి తెలిపిన


( ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టు పడ్డ ప్రయివేటు ఉపాధ్యాయుడు)


వివరాల మేరకు మచిలీపట్నం సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పాఠశాల వద్ద తెనాలి ప్రాంతానికి చెందిన బొమ్మసాని వీరాంజనేయులు నగదు పంచుతున్న విషయాన్ని యూటీఎఫ్‌ నాయకులు రఘుకాంత్‌, రాజా శ్రీధర్‌, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు శ్రీనివాసరావులు గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను తెనాలిలో ఓప్రైవేటు విద్యా సంస్థలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నానని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చందు రామారావుకు అనుకూలంగా ఓట్లు వేసేందుకు నగదు పంచుతున్నట్లు తెలిపారు. అతని నుంచి రూ.1,00,500లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్