• Neti Charithra

Breaking.. ఈతకు వెళ్లి.. ఊపిరి ఆడక పిల్లలు మృతి..మూడు కుటుంబాల్లో విషాదం..!


Breaking.. ఈతకు వెళ్లి.. ఊపిరి ఆడక పిల్లలు మృతి..మూడు కుటుంబాల్లో విషాదం..!




విశాఖ: నేటి చరిత్ర


విశాఖ జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం

విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతల్లోని నీటిలో ఈతకు దిగిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు..

గ్రామంలోని కొంతమంది చిన్నారులు శుక్రవారం మధ్యాహ్నం క్వారీ గుంతల్లో ఈతకు దిగారు. వారిలో ముగ్గురు గుంతల్లోని లోతును అంచనా వేయలేక నీటిలో మునిగి మృతిచెందారు.

మృతిచెందిన చిన్నారులను నీలకాయల బాలాజీ(12), పొడుగు గిరీశ్ (11), నందవనం శరత్‌చంద్ర (12)గా గుర్తించారు. అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్