• Neti Charithra

Breaking.. ఇంట్లో వాటర్ హీటర్ పేలి.. తల్లి తో పాటు ఇద్దరు పిల్లలు మృతి..!


Breaking.. ఇంట్లో వాటర్ హీటర్ పేలి.. తల్లి తో పాటు ఇద్దరు పిల్లలు మృతి..!


నేటి చరిత్ర: కర్నూలు


కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్లెం గ్రామంలో శనివారం విషాదం జరిగింది.

విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..సతీష్‌, కవిత దంపతులు గ్రామంలో కిరాణా దుకాణం



నిర్వహిస్తున్నారు. ఎప్పటి లాగే ఈరోజు ఉదయం కూడా హీటర్‌తో నీళ్లు కాచే సమయంలో వాటర్‌ హీటర్‌కు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో కవిత(35) విద్యుదాఘాతానికి గురైంది. పక్కనే ఉన్న చిన్నారులు నిశ్చల్‌




కుమార్‌(11), వెంకటసాయి(8) తల్లిని పట్టు కోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.