- Neti Charithra
Breaking.. ఇంటింటికీ సబ్సిడీ బియ్యం..రవాణా వాహన నిర్వాహకులకు..మరిన్ని తాయిలాలు..!
Breaking.. ఇంటింటికీ
సబ్సిడీ బియ్యం..రవాణా వాహన నిర్వాహకులకు..మరిన్ని తాయిలాలు..!
అమరావతి:నేటి చరిత్ర
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 9,260 మందికి ప్రభుత్వం సబ్సిడీపై సమకూర్చిన మొబైల్ వాహనాల నిర్వాహకులకు మరింత ఆదాయం సమకూరే ల సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర
వ్యాప్తంగాఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్వార్డ్) కార్పొరేషన్ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు. ఒక్కో యూనిట్ «(వాహనం) ధర రూ.5,81,000 కాగా, అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందింది. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.1,74,357 మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటా కేవలం రూ.58 వేలే. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు వీలుగా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించే విధంగా వీటిని సమకూర్చారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 9,260 మంది వాహనదారులకూ రూ.5 వేల చొప్పున అదనంగా లబ్ధి కలగనుంది.