- Neti Charithra
Breaking..ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం..లక్ష లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన అధికారి..!
Breaking..ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం..లక్ష లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన అధికారి..!
విశాఖపట్నం: నేటి చరిత్ర
ఇంటికి విద్యుత్ కనెక్షన్ ల కోసం ఏడుగురి నుండి ట్రాన్స్ కో అధికారి ఏకంగా లక్ష రూపాయలుడిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన ఘటన విశాఖపట్నం లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.విద్యుత్తు మీటర్లకు లంచం డిమాండు చేసిన చిట్టి వలస విద్యుత్తు ఉపకేంద్రం అసిస్టెంట్ ఇంజినీరు (ఏఈ) ఎన్వీ రమణ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. బాధితుల నుంచి రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రంగరాజు, సీఐ గపూర్లు పట్టుకున్నారు. కాపులుప్పాడ పరిధి సోమన్నపాలెంకి చెందిన మరుపల్లి రామారావు అనే బిల్డరు సంగివలసలో గ్రూపు హౌస్ నిర్మించారు. తనతో పాటు సంగివలసకి చెందిన దేవర పవన్, విశాఖకి చెందిన గోపతి రత్నయ్యల పేరిట ఆరు విద్యుత్తు మీటర్లకు ఈనెల రెండో తేదీన దరఖాస్తు చేశారు. మీటర్లు కావాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఏఈ డిమాండు చేయడంతో రామారావు రూ.70వేలకి బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అడిగిన లంచం సొమ్ము పట్టుకుని గురువారం సాయంత్రం 5 గంటలకు తగరపువలస జాతీయరహదారి సంగివలస కాలనీ వద్దనున్న విద్యుత్తు కార్యాలయానికి వెళ్లారు. రామారావు నుంచి ఏఈ డబ్బులు తీసుకుంటుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్ఫీ. సీఐ, ఇతర సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు.
హాజరుపర్చనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.