• Neti Charithra

Breaking.. ఇంజనీరింగ్ కళాశాలల్లో అక్రమాల పై చర్యలు తీసుకోండి..!


Breaking.. ఇంజనీరింగ్ కళాశాలల్లో అక్రమాల పై చర్యలు తీసుకోండి..!


కడప: నేటి చరిత్ర

ఏపీ లో పలు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏ పి టి పి ఐ ఈ ఏ అధ్యక్షులు డాక్టర్ ఎం వి బ్రహ్మానంద రెడ్డి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెస్తున్నా.. అవి పలు చోట్ల అమలు జరగటం లేదన్నారు. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్తులు సర్టిఫికెట్ల కోసం వెళితే మీ

సర్టిఫికెట్ల సెక్యూరిటీ ఫీజు అంటూ రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. మరి కొన్ని కళాశాలల్లో విద్యార్థుల ఫింగర్ ప్రింట్ యంత్రాల వినియోగం పేరుతో బయో మెట్రిక్ కు కూడా రూ.500లు కళాశాలలో బిల్డింగ్ ఫీజుల పేరుతోఅదనపు ఫీజుల పేరుతో ఒక్కొక్కరి నుండి రూ.4 నుంచి 5 వేలు వరకు వసూళ్లు చేస్తున్నారన్నారు. పలు ప్రధాన కళాశాలల్లో అధ్యాపకుల జీతాలు చెల్లింపుల్లో భారీగా కోతలు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కళాశాలల పై కఠినంగావ్యవహరించాల్సి ఉందన్నారు. సమావేశం లో ఆధ్యాపక సంఘ నాయకులు వెంకీ, పోలిరెడ్డి, ఎస్టీయూ నాయకులు బాల గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.