• Neti Charithra

Breaking.. ఇరువర్గాల ఘర్షణ.. బి కొత్తకోట మండలం లో దారుణ హత్య..!Breaking

Breaking.. ఇరువర్గాల ఘర్షణ.. బి కొత్తకోట మండలం లో దారుణ హత్య..!బి కొ త్తకోట: నేటి చరిత్ర


(దారుణ హత్యకు గురైన వెంకట రమణ)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో ఓ వ్యక్తి ని ప్రత్యర్థులు హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు..

బి కొత్తకోట పట్టణ శివారు అలెటి వారిపల్లె లో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుణ్ణి మహిళ కు సంబంధించిన బంధువులు యువకుని పై

దాడి చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం మరో మారు వీరు శుక్రవారం రాత్రి మళ్ళీ గొడవలకు దిగడం తో ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుని తండ్రి వెంకట రమణ (55) తలకు

తీవ్రగాయాలు అయ్యాయి. ఇతన్ని

మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్ బి కొత్తకోట కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సి ఉంది.