• Neti Charithra

Breaking.. ఇన్విజిలేటర్ గా వెళ్లి.. కరోనా తో మృతి చెందిన ఉపాధ్యాయుడు..!


Breaking.. ఇన్విజిలేటర్ గా వెళ్లి..

కరోనా తో మృతి చెందిన

ఉపాధ్యాయుడు..!


చిలకలూరిపేట: నేటి చరిత్ర


గుంటూరు జిల్లా చిలకలూరిపేట

బొప్పూడి ఎంపీపీఎస్‌(హెచ్‌ఈ) పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్‌కే సర్దార్‌ బాషా(49) కొవిడ్‌తో బాధపడుతూ ఆదివారం మృతిచెందారు. గత ఆదివారం

నిర్వహించిన సచివాలయ పరీక్షల్లో ఆయన ఇన్విజిలేటర్‌గా పని చేశారు. అనంతరం రెండ్రోజుల తరువాత జ్వరంగా ఉండటంతో ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో చికిత్స పొందుతూ ఊపిరాడక

మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుని మృతికి ఎంఈవో కె.లక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు ఆత్మకూరి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.