• Neti Charithra

Breaking.. ఇద్దరు కలెక్టర్ల కు జైలు శిక్ష. . హైకోర్టు.. సంచలన తీర్పు..!


Breaking.. ఇద్దరు కలెక్టర్ల కు జైలు శిక్ష.

. హైకోర్టు.. సంచలన తీర్పు..!


హైదరాబాదు: నేటి చరిత్ర


కోర్టు ధిక్కారనికి పాల్పడిన ఘటన లో ఇద్దరు కలెక్టర్ లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన ఘటన తెలంగాణా లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్‌ భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌, అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా (ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్‌), భూసేకరణ అధికారి

ఎన్‌.శ్రీనివాసరావులకు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 11 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఖర్చుల కిందకూడా చెల్లించాలని ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వి.ముత్తారెడ్డి, మరో 10 మంది రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు సంచలన తీర్పు వెలువరించారు