• Neti Charithra

Breaking.. ఇద్దరు అమ్మాయిలు.. ప్రేమించు కున్నారు..ఆపై పెళ్లి చేసుకున్నారు..అంతలోనే పెను విషాదం..!


Breaking.. ఇద్దరు అమ్మాయిలు.. ప్రేమించు కున్నారు..ఆపై పెళ్లి చేసుకున్నారు..అంతలోనే పెను విషాదం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


వారిద్దరూ..అమ్మాయిలే.. సహజత్వానికి భిన్నంగా ప్రేమించుకున్నారు. ..ఆపై పెళ్లి చేసుకున్నారు.. అయితే.. ఇరు కుటుంబాల నుంచి పెరిగిన ఒత్తిడి తో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ లో

చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

వారిద్దరూ ఒకే తరగతికి చెందిన అమ్మాయిలు... కలిసి రెండేళ్లు చదువుకున్నారు. మనసులు కలిసి జీవితాంతం బతకాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరి బంధానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఓ యువతి(19) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. శంకర్‌పల్లి ఎస్సై లక్ష్మినారాయణ, బంధువుల కథనం మేరకు..మండలానికి చెందిన ఓ యువతి(19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇంటర్‌ హాస్టల్‌లో ఉండి చదువుకుంది. అదే కళాశాలలో చదువుతున్న ఖమ్మం జిల్లా మణుగూరుకి చెందిన మరో యువతి(24)తో స్నేహం కాస్తా ప్రేమగా మారింది. జీవితాంతం కలిసుండాలని భావించిన వీరిద్దరూ గతేడాది జనవరిలో ఇంట్లో నుంచి పారిపోయి వికారాబాద్‌లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. మూడు నెలలపాటు అద్దె గదిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వీరి జాడను గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్‌ చేసి ఎవరింటికి వారిని పంపించారు. అప్పట్నుంచి ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడాన్ని తల్లిదండ్రులు గుర్తించి వద్దని వారించారు. ఈ నేపథ్యంలో తాజాగా మనస్తాపానికి గురైన యువతి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్