• Neti Charithra

Breaking... ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పై సంచలన తీర్పు చెప్పిన హైకోర్టు..!


Breaking... ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పై సంచలన తీర్పు చెప్పిన హైకోర్టు..!



అమరావతి:నేటి చరిత్ర


ఏపీ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై

హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు 10 నెలల క్రితం ఇచ్చిన

నోటిఫికేషన్‌ పై తాజాగా నోటిఫికేషన్‌

ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో నామనేషన్లు వేయనీయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. యథావిధిగా మార్చి 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.