• Neti Charithra

Breaking.. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కరోనా బాధితులు సజీవ దహనం..!


Breaking.. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కరోనా బాధితులు సజీవ దహనం..!




కరోనా బాధితులకు వైద్య పరీక్షలు అందించే

ఓ ప్రముఖ ఆసుపత్రి లో జరిగిన అగ్ని ప్రమాదం లో ఇద్దరు సజీవ దహనం కాగ పదుల సంఖ్యలో కరోనా బాధితులు గాయపడిన ఘటన ముంబయి లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ముంబయి మహా నగరంలోని భాండప్‌ ప్రాంతంలోని ఓ

ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో 76 మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో తేరుకున్న ఆసుపత్రి సిబ్బంది సుమారు 70 మంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నట్లు ముంబయి మేయర్ తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్