• Neti Charithra

Breaking..ఆరేళ్ళ బాలిక పై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం..కేసి నమోదు చేసిన పోలీసులు..!


Breaking..ఆరేళ్ళ బాలిక పై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం..కేసి నమోదు చేసిన పోలీసులు..!



ప్రొద్దుటూరు: నేటి చరిత్ర


అభం..శుభం.. తెలియని ఆరేళ్ళ.. బాలిక పై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు కథనంమేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన బాలిక (6) తన తల్లితో కలిసి అవుకులో ఉంటున్న అమ్మమ్మ వద్దకు బుధవారం వచ్చింది. పొరుగింటికి చెందిన బాలుడు (13) మాయమాటలు చెప్పి బాలికను తన ఇంటి లోపలకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏంజరిగిదో తెలియని బాలిక కేకలు పెడుతూ బయటకురావడంతో ఘటన వెలుగు చూసింది. రక్తస్రావం జరగడంతో కుటుంబ సభ్యులు బాలికను చికిత్స నిమిత్తం బనగానపల్లి వైద్యశాలకు తీసుకువెళ్లారు. తల్లి ఫిర్యాదు మేరకు డీఎస్పీ నరసింహారెడ్డి, ఎస్సై మహేష్‌ కుమార్‌లు గురువారం విచారణ చేశారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.